Namaste NRI

అర్జున్ చక్రవర్తి నుంచి మేఘం వర్షించదా సాంగ్ రిలీజ్

విజయ రామరాజు టైటిల్‌రోల్‌ చేసిన స్పోర్ట్స్‌ డ్రామా అర్జున్‌ చక్రవర్తి. విక్రాంత్‌ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. మేఘం వర్షించదా అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని చిత్ర దర్శకుడు విక్రాంత్‌ రుద్రా రాయగా, విఘ్నేష్‌ భాస్కరన్‌ స్వరపరిచారు. కపిల్‌ కపిలన్‌, మీరా ప్రకాష్‌, సుజిత్‌ శ్రీధర్‌ ఆలపించారు. విజయ రామరాజు, కథానాయిక సీజా రోజ్‌ల కెమిస్ట్రీ ఈ పాటలో అద్భుతంగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

ప్రచారంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఇప్పటికే కేవలం ఇన్‌స్టాలోనే 16 మిలియన్ల వ్యూస్‌ తెచ్చుకున్నదని, యూట్యూట్‌లో అయితే ఏకంగా 1.5 మిలియన్ల వ్యూస్‌ దాటిందని మేకర్స్‌ తెలిపారు.  అజయ్‌ ఘోష్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జగదీశ్‌

Social Share Spread Message

Latest News