
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి ఇందులో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ టీజర్‌ని ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్ స్కేప్‌లో డైనమిక్‌గా నడుస్తూ మోడరన్ అవతార్‌లో ఉన్న కల్యాణ్‌రామ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ప్రీ టీజర్‌లోనే అఫీషియల్ టీజర్ విడుదల తేదీని కూడా రివీల్ చేయనున్నామని మేకర్స్ తెలిపారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
