Namaste NRI

ATA Signs MOU with RGUTKT – IITబాసర TS

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. ఆటా సేవ కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, సరస్వతి దేవి వెలసిన బాసర లో గల రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ IIIT తో ఆటా MOU కుదుర్చుకుంది.అలాగే విద్యార్థులతో వాక్ థాన్, మెంటల్ స్ట్రెస్ వంటి వివిధ అంశాలపై ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ గల విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ వెంకటరమణ సభ అధ్యక్షత వహించగా, జయంత్ చల్లా మాట్లాడుతూ…ఎందరో ప్రతిభ గల విద్యార్థులకు నిలయం RGUKT అన్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల గవర్నమెంట్ స్కూల్స్ నుండి వచ్చిన వారు అన్నారు. ఈ RGUKT ద్వారా ఎందరో ఉన్నతమైన స్థానాలకు ఎదిగారు అన్నారు. IIIT విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో MOU కుదుర్చుకున్నాం అన్నారు. ఈ MOU ద్వారా వచ్చే 2 ఏళ్ల పాటు ఆటా ప్రొఫెసర్స్ వచ్చి విద్యార్థులతో వివిధ అంశాలపై లెక్చర్ ఇస్తారు అన్నారు.

American Telugu Association (ATA) organized a walkathon and educational seminar as part of the ATA Vedukalu at RGUKT-IIIT Basar, Telangana. 1000 people attended this event. A  Memorandum of Understanding agreement (MOU) between the American Telugu Association & RGUKT- IIIT.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events