ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కవిత బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. వినయ్ సన్నీ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకుందన్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు, పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో తెలియజెప్పడానికి విశేష కృషి చేస్తుందన్నారు. తమకీ అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు చేస్తున్న కవిత కృషిని కొనియాడారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సతీష్ పులిపాక, విక్రమ్ కందులతో పాటు వివిధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
