Namaste NRI

అట్లాంటాలో ఆటా కాన్ఫరెన్స్‌ ఫండ్‌  రైజింగ్‌ ఈవెంట్‌

ఆటా 18వ కాన్ఫరెన్స్‌, యూత్‌ కన్వెన్షన్‌ కిక్‌ ఆఫ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ అట్లాంటాలో ప్రత్యేక సందడి నెలకొల్పింది. సుమారు 1000 మందికి పైగా విచ్చేసిన భారత ప్రవాసులతో పండగవాతావరణం నెలకొంది. గణనాథుని ఆరాధన, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైన ఈవెంట్ నృత్య, సంగీత, వినోదాత్మక కార్యక్రమాలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది.

ఆటా కన్వెన్షన్ డోనర్స్, స్పాన్సర్లు, కన్వెన్షన్ కోర్ టీం సభ్యులతో, ఆటా అట్లాంటా కోర్ టీం,  కన్వెన్షన్ కమిటీలు, ఆయా కమిటీ చైర్, కో- చైర్, అడ్వైజర్, సభ్యుల పరిచయం, సత్కారాలతో సందడి నెలకొంది. అట్లాంటా తరుపున కన్వెన్షన్ కొరకు 1.45 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ విశేష వార్తగా మరియు అట్లాంటా గర్వించదగు క్షణంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ప్రసంగిస్తూ ఆటా 18వ కన్వెన్షన్ కోసం అట్లాంటా చేపడుతున్న అద్భుత సన్నాహాలకు, అనూహ్య నిధి సేకరణకు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిథి విశ్వ ప్రసిద్ధులు, విశేష కళాకారులు మిమిక్రీ రమేష్ తమ మిమిక్రీ కళాప్రదర్శనతో ప్రత్యేక సందడి నెలకొల్పారు. వివిధ ప్రణాళికలు, ప్రతిపాదనలు, సందేశాలతో కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కన్వెన్షన్ డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, కో- కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో- డైరెక్టర్ శ్రీరామ్, కన్వెన్షన్ అడ్వైజర్ కమిటీ చైర్ గౌతమ్ గోలి, కన్వెన్షన్ అడ్వైజర్లు కరుణాకర్ అసిరెడ్డి వెంకట్ వీరనేని ప్రసంగాలు, కన్వెన్షన్ టీం కన్వెన్షన్ గూర్చి అందించిన ఇతర ముఖ్య సమాచారం, సందేశాలు సభాసదులకు కీలక అంశాలను తెలియజేశాయి.

పలు జాతీయ, ప్రాంతీయ తెలుగు సంఘాలు TANA, NATA, TTA, TDF, GTA , TAMA, GATeS, GATA , శంకర్ నేత్రాలయ వారి అనూహ్య ఆదరణ, సహకారాలతో సామరస్య ఉమ్మడి కుటుంబ సందడిని ప్రతిబింబించింది. ఆటా  కిక్ ఆఫ్ కార్యక్రమం అంటూ ప్రత్యేక ప్రశంసనందుకుంది.

ఈవెంట్ కోఆర్డినేటర్లు అనుపమ సుబ్బగరి, శృతి చిట్టూరి, ఉదయ ఈటూరి, మల్లిక దుంపల, శ్వేత, ఈవెంట్ యాంకర్లు శ్రావణి రాచకుళ్ళ, మాధవి దాస్యం, రీజనల్ డైరెక్టర్ గోపి కొడాలి, రీజనల్ కోఆర్డినేటర్లు సందీప్, గణేష్ కాసం & కిషన్, స్టాండింగ్ కమిటీ చైర్లు, సభ్యులు జయ చంద్ర, ఉమేష్ ముత్యాల, శివ రామడుగు, రఘు వలుసాని, నిరంజన్ పొద్దుటూరి, శ్రీధర్ పాశం, కీర్తిధర్, కాన్ఫరెన్స్ కో- కన్వీనర్ ప్రశాంతి అసిరెడ్డి, కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదిని ఆద్యంతం అద్భుత సహకారాన్ని అందిస్తూ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ముదావహం. కన్నులనబ్బురపరిచే ఆహ్లాధభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో సభ సరదాలతో నిండిపోగా.. రీజనల్ డైరెక్టర్స్ కృతజ్ఞతా ప్రతిపాదనలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress