
అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకోబోతున్నది. గత కొంతకాలంగా ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. అతను అడిగాడు. నేను నవ్వాను. ఏడ్చాను. ఆ తర్వాత గట్టి అరిచి ఎస్ అని చెప్పాను. నా జీవితంలో ఈజియెస్ట్ అవును అని చెప్పాను. ప్రేమ అన్నది పరిపూర్ణం కాకపోయినా అది మాయాజాలం లాంటిది. మిలింద్ తన మనసులోని మాటలు చెబుతున్నప్పుడు నేను సినిమా ప్రేమికురాలిగా మారిపోయా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో-మోషన్ డ్రీమ్స్ కనిపించాయి. అతను లాజిక్‌గా మాట్లాడుతాడు. ప్రశాంతంగా ఉన్నాడు. అతను అడిగిన సందర్భంలో గాల్లో తేలినట్లు అనిపించింది. నా కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. నా మైండ్ ,లో ఇంకే ఆలోచనలు లేవు. ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ? ఇది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ, ఇదొక మ్యాజిక్ అంటూ అవికా గోర్ పేర్కొంది.
