Namaste NRI

 దీపావళి కానుకగా అయలాన్

శివ‌కార్తికేయ‌న్ హీరోగా నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్‌ అయలాన్. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మేకర్స్‌ ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లాంఛ్ చేశారు. శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా,  అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళ్లడం పోస్టర్‌లో కనిపిస్తోంది. మొత్తానికి ఈ సారి మాత్రం సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగే సినిమాను అభిమానులకు అందించేందుకు శివ‌కార్తికేయ‌న్ రెడీ అవుతున్నాడని తాజా లుక్‌తో అర్థమవుతోంది. అంతేకాదు దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ దీంతోపాటు మ‌డొన్నే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మావీరన్ ‌లో కూడా నటిస్తున్నాడు. తెలుగులో మ‌హావీరుడు టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. స్టార్ డైరెక్టర్‌ శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events