నవంబరు 16 నుండి జనవరి 14 వరకు సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో 2024 అయ్యప్ప మండల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. నేతి అభిషేకం, గణపతి హోమం, సహస్రనామార్చనలతో పాటు ప్రత్యేక పూజలను ఈ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు సాక్షి విజయ్ తెలిపారు. మండలం ఉత్సవం (41వ రోజు) డిసెంబరు 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్న ట్లు ఆలయ కార్యక్రమాల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు పూట్టగుంట మురళీకృష్ణ, పూజ కమిటీ అధ్యక్షురాలు ధన్య అయ్యర్‌లు వెల్లడించారు. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని శబరిమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు నారాయణన్ నంబూద్రి ఈ క్రతువు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.