ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో బేబీ చిత్రం ఐదు అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిం దే. ఈ సందర్భంగా చిత్ర బృందం పాత్రికేయులతో ముచ్చటించింది. చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడు తూ 8 నామినేషన్స్‌కుగాను 5 దక్కడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు క్రిటిక్స్ మెచ్చిన బెస్ట్ మూవీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. కల్ట్‌మూవీ తీస్తున్నామని షూటింగ్ సందర్భంగా దర్శకుడు మారు తి ఎంతగానో ప్రోత్సహించారు. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలను కుంటున్నాం అన్నారు.
చిన్న చిత్రాలకు అవార్డులు రావని నిరాశ పడేవారికి ఉత్సాహాన్నిచ్చేలా బేబీ చిత్రానికి అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందని, దర్శకుడు సాయిరాజేష్ ప్రతిభపై తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని దర్శకుడు మారుతి చెప్పారు. ఈ సినిమా తమకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని, రివార్డులతో పాటు అవార్డులూ రావడం ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది.