
గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతిలయ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం బ్యాచిలర్స్ ప్రేమకథలు. ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వం. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.సముద్ర కెమెరా స్విఛాన్ చేయగా, మరో దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. వినోదంతోపాటు సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని, ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తామని దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ తెలిపారు. ఇంకా ప్రధాన పాత్రధారులంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ ఎస్, సంగీతం: మెరుగు అరమాన్, నిర్మాణం: ఎస్‌ఎం4 ఫిల్మ్స్.
