చాట్ జీపీటీ సృష్టికర్త శ్యామ్ ఆల్ట్‌మన్ తిరిగి ఓపెన్ ఏఐలో పూర్వపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇన్వెస్టర్లు, ముఖ్య ఉద్యోగుల నుంచి ఒత్తిడి రావటంతో, కొత్త సభ్యులతో బోర్డును ఏర్పాటుచేయడానికి ఓపెన్ ఏఐ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ సీఈవోగా ఆల్ట్‌మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆల్ట్‌మన్‌ను తొలగిస్తూ ఓపెన్ ఏఐ బోర్డు వారం రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ఆ కంపెనీని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగులు, ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.