
రవితేజ 75వ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రకటన వెలువ డింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణభేరి. ఈ చిత్రానికి కోహినూర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
