Namaste NRI

బద్మాషులు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

మహేష్‌ చింతల, విద్యాసాగర్‌, బలగం సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బద్మాషులు. శంకర్‌ చేకూరి దర్శకుడు. రమాశంకర్‌ నిర్మాత.  ఈ  చిత్రం  ప్రీరిలీజ్‌ వేడుకకు దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు వినోదభరితంగా సాగే చిత్రమిదని, తెలంగాణ నేపథ్యంలో నడుస్తుందని దర్శకుడు తెలిపారు. ఎక్కడా నాటకీయత లేకుండా సహజసిద్ధమైన హాస్యంతో ఈ సినిమా మెప్పిస్తుందని నటుడు మహేష్‌ చింతల చెప్పారు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News