ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బలగం. వేణు ఎల్దండి దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ లభించింది. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్స్ ఆరంభించాం. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే అద్భుతమైన కథ ఇది. హృదయాన్ని తడిమే భావోద్వేగాలో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు అని చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాతలు పేర్కొన్నారు. సినిమాలో సుధాకర్ రెడ్డిగారు, జయరాం, మురళీధర్, విజయ లక్ష్మి, స్వరూప, మొగిలి నటిస్తున్నారు. మార్చి 3న ప్రేక్షకల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కథా విస్తరణ, , స్క్రీన్‌ప్లే: రమేష్ ఎగిలేటి, నాగరాజు మడూరి, పాటలు: కాసర్ల శ్యామ్, దర్శకత్వం: వేణు ఎల్దండి.