Namaste NRI

బాలయ్య డాకు మహారాజ్‌ .. ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్‌.  ఈ సినిమాకు కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్‌నూ, ప్రచార చిత్రాలను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్‌ మొదలుపెట్టారు.

ది రేజ్‌ ఆఫ్‌ డాకు పేరుతో తొలి గీతాన్ని విడుదల చేశారు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసేలా అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను తమన్‌ స్వరపరచగా, భరత్‌ రాజ్‌, నకాష్‌ అజీజ్‌, రితేష్‌ జి.రావు, కె.ప్రణతి ఆలపించారు. డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా, ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా అనే పవర్‌ఫుల్‌ పంక్తులతో అనంతశ్రీరామ్‌ ఈ పాటను రాశారని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ వీడియోలో మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో బాలకృష్ణ కనిపిస్తున్నారు. విజువల్స్‌లో భారీ తనం కనిపిస్తున్నది. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధ్ధా శ్రీనాథ్‌, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress