నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయింది. సినిమా విడుదల సందర్భంగా అమెరికాలోని బే ఏరియాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు. సంక్రాంతికి బాలకృష్ణ మరోసారి మంచి మాస్ హిట్ అందుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. డాకు మహారాజ్ విజయం ఇచ్చిన కిక్‌తో అక్కడి బాలయ్య అభిమానులు, ఎన్నారైలు బే ఏరియాలో సంబరాల్లో మునిగిపోయారు. సివర్ స్క్రీన్ మావెరిక్స్ టీమ్ సభ్యులు సత్య మల్లిరెడ్డి, గంగా కోమటి, ఉదయ్ కిరణ్ సిస్టా, మూర్తి అయ్యగారి, అరవింద్ ముసునూరి, రత్నకుమార్, ధీరేందర్ సింగ్, భాగ్యరాజ్ గుర్రం, బాలయ్య అభిమానులు శ్రీకాంత్ దొడ్డపనేని, సాయి కంభంపాటి, అజయ్ యార్లగడ్డ, భక్త బల్ల, వెంకట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో డాకు మహారాజ్ విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి, సంబరాలు జరిపారు.