నందమూరి బాలయ్య 108వ చిత్రం ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. ఎస్‌బీకే 108 వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తమన్‌ను ఖారారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మనుపెన్నడూ చూడని లుక్‌తో కనిపిస్తారు. తమన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని దర్శకులు అనిల్ తెలిపారు. ఈ సినిమా కోసం ఆయన ఓ విభిన్నమైన మాస్క్ స్క్రిప్ట్ సిద్దం చేశారు. బాలకృష్ణ`అనిల్ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని చిత్రబృందం తెలిపింది. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.














