Namaste NRI

భారత్ కు బంగ్లాదేశ్ గుడ్ న్యూస్

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు నుంచి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రహమాన్ మూడు రోజుల్లోనే ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూలంగా స్పందించాడు. వీసాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

దీంతో ఢిల్లీలో బంగ్లా రాయబార కార్యాలయంలో అన్ని రకాల వీసాల మంజూరు సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఢాకాలో కూడా బంగ్లా నుంచి ఇండియాకు వచ్చేందుకు వీసాల సేవల్ని పునరుద్ధరిస్తామని అనిరుద్ధా దాస్ అనే బంగ్లాలోని భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. మెడికల్, టూరిజం వంటి అన్ని రకాల వీసా సేవలు అందుబాటులోకి వస్తాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events