దర్శకుడు మారుతి సమర్పకుడిగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బార్బరిక్. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. టీజర్‌ను విడుదల చేశారు. స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పనికాదు. దిమాక్ ఉన్నోడే చేయాలి. ఒకడు తాచుపాము తోకని తొక్కాడు. వాడ్ని పాము కాటేయబోతోంది. మరి తొక్కించిన వాడి సంగతేంటి? అనే డైలాగ్‌తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. మారుతి మాట్లాడుతూ మైథాలజికల్ పాత్ర నేటి ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే అంశం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సరికొత్త పాయింట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. తన కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని సత్యరాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఇన్ఫ్యూషన్ బ్యాండ్ సంగీతాన్నందిస్తున్నది.