Namaste NRI

టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో టొరంటో కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ – మిస్సిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.

ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. ఈ సంబరాలలో బతుకమ్మ ఆట పాటలతో చివరగా పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వులపిండి, పల్లీలపిండి ప్రసాదం పంపిణి చేసారు. ఈ సంవత్సరం బతుకమ్మలలో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు, తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం బహుమతిగా అందజేశారు.

కార్యక్రమం చివర్లో అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు సహకరించిన టొరంటో తెలుగు ప్రజల్ని అభినందించారు మరియు స్వచ్ఛంద స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డ్ సహకారాలని ఎంతో కొనియాడారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – శంకర్ భరద్వాజ పోపూరి, ప్రణీత్ పాలడుగు, శ్రీరంజని కందూరి, ప్రవీణ్ కుమార్ సామల ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా గారు, వ్యవస్థాపక సభ్యులు – హరి రావుల్, దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, సంతోష్ గజవాడ, ప్రకాష్ చిట్యాల, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, అఖిలేష్ బెజ్జంకి, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events