Namaste NRI

బెల్లంకొండ సాయి సినిమా టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి హైందవ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వం. ఈ చిత్రాన్ని మహేష్‌ చందు నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవిత్రమైన దశావతార ఆలయాన్ని నాశనం చేయడానికి కొందరు దుండగులు చేసే ప్రయత్నాన్ని హీరో భగ్నం చేయడం, ఈ క్రమంలో ఎదురయ్యే ఆశ్చర్యకరమైన ఘటనలతో గ్లింప్స్‌ ఉత్కంఠను పంచింది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ శక్తివంతమైన పాత్రలో కనిపించారు. దేవుడి విగ్రహాలను, దేవాలయాలను తమ స్వార్థం కోసం వాడుకునే దుష్టశక్తులను దైవం ఏ రూపంలో శిక్షిస్తుంది? ఎవరి ద్వారా ధర్మరక్షణకు సంకల్పిస్తుందనే అంశాల తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు పాన్‌ ఇండియా స్థాయిలో మంచి టైటిల్‌ కుదిరిందని, ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఆధ్యాత్మికత, యాక్షన్‌ అంశాల కలబోతగా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివేంద్ర, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, నిర్మాణ సంస్థ: మూన్‌షైన్‌ పిక్చర్స్‌, రచన-దర్శకత్వం: మహేష్‌ చందు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress