కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్ నుంచి ప్రారంభం కానున్న జోడో యాత్ర ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో ముగుస్తుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ నేతలు, శ్రేణులు రాహుల్ యాత్రకు సమాంతరంగా మార్చ్ చేపడతారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో దశ గుజరాత్ నుంచి ఆరంభమై మేఘాలయా వరకూ కొనసాగుతుందని తెలిపారు.














