మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డ్ ఇస్తున్నట్లు మోడీ కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీ కి ఫోన్ చేసిన ప్రధాని కంగ్రాట్స్ చెప్పినట్లు తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని ప్రధాని వెల్లడించారు.
అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. విభజన సమయంలో భారతదేశానికి వలసవచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు. అక్కడే కళాశాల విద్యను పూర్తి చేశారు. 14 ఏళ్ల వసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో (1941లో) చేరి రాజస్థాన్ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌లో సభ్యుడి గా చేరారు. పార్లమెంటరీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, జనరల్ సెక్రటరీ, ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు సహా పలు పాత్ర లను నిర్వహించారు. 1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించా రు. ఆ తర్వాతి ఏడాది అంటే 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. 1970 వరకూ ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
ఇక 1970లో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989 వరకూ నాలుగు పర్యారాలయు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. 1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు. 1998 – 2004 మధ్య హోం వ్యవహారాల మంత్రిగా, 2002 – 2004 వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఇక 2015లో అద్వానీ భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు.