హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏ. హర్ష దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. సోమవారం గోపీచంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంభాషణలు: అజ్జూ మహంకాళి, సంగీతం: రవి బస్రూర్, దర్శకత్వం: ఏ.హర్ష.


