Namaste NRI

మంత్రి కేటీఆర్ లాంచ్ చేసిన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా టీజర్

ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, డా॥ కీర్తిలత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయిప్రసన్న ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. రమేష్ చెప్పాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను  ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న భీమదేవరపల్లి బ్రాంచి చిత్ర టీజర్ ను చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను. అలాగే మంచి మెసేజ్ ఉన్న సినిమా అని అర్థం అవుతోంది. పూర్తి సినిమాను తప్పకుండా చూస్తాను  అన్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్‌తో  ఈ సినిమాను తెరకెక్కించాం. చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల వారిని మెప్పించే అంశాలుంటాయి అన్నారు. నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌గారు  టీజర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. చక్కటి సందేశాన్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా :కె. చిట్టిబాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ, నిర్మాతలు: డాక్టర్ ॥ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి, రచన-దర్శకత్వం: రమేష్ చెప్పాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events