Namaste NRI

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగా స్టార్‌  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించాడు. సిస్టర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. సుశాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

మరో మూడు వారాల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా చక చక ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. జూలై 27న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చేతిలో కత్తి పట్టుకుని మాస్‌ అవతారంలో ఉన్న చిరు లుక్‌ అదిరిపోయింది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లలో ఈ లుక్‌ మాత్ర వేరే లెవల్లో ఉంది. ఇక త్వరలోనే మేకర్స్‌ ప్రమోషన్‌లు కూడా షురూ చేయనున్నట్లు తెలుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events