ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి శరవేగంతో తయారవుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్‌ని టీమ్ విడుదల చేసింది. ఒక గుహలో తన ముఖాన్ని గుడ్డతో కప్పేసుకుని , చేతిలోని కర్రతో సాధువు గెటప్‌లో కనిపించారు అమితాబ్. ఆయన కళ్లు మాత్రం వింత కాంతితో మెరుస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ శాన్ డియాగో కామిక్ కాన్‌లో లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న కల్కి చిత్రం 2024 ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.