తెలుగు మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ పుష్ప -2 ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పుష్ప ప్రాంఛైజీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ పాత్రలో నటించాడు.
తాజాగా బర్త్ డే విషెస్ చెబుతూ ఫహద్ ఫాజిల్ లుక్ విడుదల చేశారు. పార్ట్ 1లో ఒక్కటి తగ్గింది. అంటూ సందడి చేసిన షెకావత్ సార్ ఈ సారి మాత్రం గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీలో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపిస్తున్నాడు. షెకావత్‌గా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించబోతు న్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.