ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ దూసుకెళ్తున్నారు. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టాడు. స్టాక్‌మార్కెట్‌లో మెటా షేర్ల ధరలు అమాంతం (22%) పెరగటంతో ఆయన సంపద విలువ 28 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) మేర పెరిగింది. దీంతో జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 165 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 124 బిలియన్ డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ 5వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత నాలుగో స్థానంలో మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు.