Namaste NRI

అమెరికా చట్టసభలో.. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ రద్దుకు బిల్లు

వచ్చే ఏడాదినాటికి హెచ్‌-1బీ కార్యక్రమానికి ముగింపు పలకాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా వలస విధానం, జాతీయత చట్టాన్ని, వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ ఫ్లోరిడా ప్రతినిధి, రిపబ్లికన్‌ గ్రెగ్‌ స్టీబ్‌ ఎక్సైల్‌ యాక్ట్‌ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అవినీతితో కూడిన హెచ్‌-1బీ కార్యక్రమంతో అమెరికా ఉద్యోగులు చాలాకాలంగా మోసపోతున్నారు. చౌకగా లభ్యమవుతున్న విదేశీ ఉద్యోగులను దిగుమతి చేసుకోవటం ద్వారా తమ ఆదాయాన్ని కాపాడుకోవడానికి కార్పొరేషన్లు ఈ వ్యవస్థను పదేపదే దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది వేతనాలను అణచివేసింది. దీనివల్ల లక్షలాది మంది అమెరికన్లు మంచి జీతం పొందే ఉద్యోగాలకు దూరమయ్యారు అని స్టీబ్‌ తెలిపారు. ఇలాంటిదే ఓ బిల్లును గతంలో టేలర్‌ గ్రీన్‌ కూడా అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events