రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్‌కు చెందిన డైరెక్టర్ బెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పుతిన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే 2.5 నిమిషాల ట్రైలర్‌ను విడుదల చేశారు. పుతిన్‌కు సంబంధించిన ఆరు దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా పేర్కొనడం గమనార్హం. పుతిన్ పాత్రను కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్, సిరియా, జోర్డాన్, పోలాండ్‌లో చిత్రీకరించారు.సెప్టెంబర్ 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు.