
తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కథానాయిక ధన్సికతో ఆయన నిశ్చితార్థం చెన్నైలో జరిగింది. తన జన్మదినం రోజే ఎంగేజ్‌మెంట్ జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో పెళ్లి తేదీని వెల్లడిస్తామని విశాల్ తెలిపారు. ధన్సికతో తన ప్రేమ బంధం గురించి విశాల్ కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే పాల్గొన్నట్టు వెల్లడించారు. ధన్సికతో నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో త్వరలోనే నా బ్యాచిలర్ జీవితానికి ముగింపు రానుంది. ఇకపై నా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండవు అని పేర్కొన్నారు.
















