హీరో నితిన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయిక. అగ్రనటుడు డా.రాజేంద్ర ప్రసాద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతున్నది. డా.రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏజెంట్ జాన్ స్నో అకా జనార్దన్ సున్ని పెంట గా ఆయన పాత్రను పరిచయం చేస్తూ, లుక్‌ని విడుదల చేసి, శుభాకాంక్షలు అందించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ అద్భుతమైన వినోదాన్ని పంచనున్నారని, ఆయన గెటప్‌లాగే పాత్ర కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.