Namaste NRI

బాణామతి బ్యాక్ డ్రాప్ లో చేతబడి

1953లో గిరడ అనే గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం చేతబడి. సూర్యాస్‌ దర్శకుడు. నందకిశోర్‌ నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ  సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చేతబడి అనేది మనదేశంలో 16వ శతాబ్దపు నాటి కళ. ఒక ఈవిల్‌ ఎనర్జీతో ఒక వ్యక్తిని శారీరకంగా పతనం చేసే విద్యే చేతబడి. మామూలుగా వర్షంలో తడిచిన నేలపై చిన్న బొంగు పాతినా ఊరకే దిగబడి పోతుంది.

కానీ 200ఏండ్ల నాటి ముదురు వెదురు బొంగులు సైతం, దిగనంత గట్టి వర్షపు నేలపై బతికున్న నల్ల కోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుందో,  ఇందులో చూపెట్టబోతున్నాం  అని తెలిపారు. ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ రియలిస్టిక్‌గా ఉంటాయని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మిర్లాన్‌ నజీర్‌, సంగీతం: అచ్చు రాజమణి, సహనిర్మాత: నరేష్‌ జైన్‌, నిర్మాణం: శ్రీశారద రమణా క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events