భారతదేశంలో మైనారిటీల స్థితిగతులపై అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై వార్షిక స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక, 2023 విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌లో మత మార్పిడుల నిరోధక చట్టాలు, మైనారిటీలపై విద్వేష ప్రసంగాలు, మైనారిటీల ప్రార్థనా స్థలాలు, ఇళ్ల కూల్చివేతలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని 10 రాష్ర్టాల్లో మత మార్పిడులను కట్టడి చేసే చట్టాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.