బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వారాహి చలన చిత్ర పతాకాలపై అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించారు. ప్రస్తుతం బాలకృష్ణ…బాబీ దర్శకత్వం లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.