Namaste NRI

సంక్రాంతికి వస్తున్నాం నుంచి బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్

వెంకటేశ్‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ జనబాహుళ్యంలో బాగా వినిపిస్తున్నాయి. వందశాతం సక్సెస్‌రేట్‌ ఉన్న దర్శకుడు అనిల్‌ రావిపూడి నుంచి మరో బ్లాక్‌బస్టర్‌ పక్కా అని సినీ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. ప్రచారంలో కూడా సినిమా దూసుకుపోతున్నది. గాయని రోహిణి సోరబ్‌, భీమ్స్‌ సిసిరోలియోలతో కలిసి హీరో వెంకటేశ్‌ స్వయంగా ఆలపించిన పండుగ ప్రత్యేక గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు.

గొబ్బియల్లో గొబ్బియల్లో పండగొచ్చే గొబ్బియల్లో, ఎవ్రీబడీ గొబ్బియల్లో, సింగ్‌ దిజ్‌ మెలొడీ గొబ్బియల్లో, పెద్ద పండగండి గొబ్బియల్లో లెట్స్‌ గెట్‌ ట్రెండీ గొబ్బియల్లో కమాన్‌  బేసికల్లీ  టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ డ్‌ ఫైనల్లీ ఇట్స్‌ ఏ యాటిడ్యూడ్‌ పొంగలూ  ఇట్స్‌ ఏ బ్లాక్‌బస్టర్‌ పొంగలూ అంటూ ట్రెండీగా రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచారు. వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలపై సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్‌, నరేష్‌, వీటీ గణేష్‌, మురళీధర్‌గౌడ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: శిరీష్‌, సమర్పణ: దిల్‌రాజు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events