అమెరికాలో మన అమెరికన్ తెలుగు సంఘం (మాటా) ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఫిల్లీలో, న్యూజెర్సీ, అట్టాంటాలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి మాట్లాడుతూ బోనాల పండుగ మన సాంస్కృతిక గౌరవానికి, ఐక్యతకు నిజమైన ప్రతిబింబం. మాటా కుటుంబ సభ్యులంతా అంకితభవంతో కలిసి కట్టుగా మన సంప్రదాయాలకు ప్రతిబింబమైన వేడుకలను జరుపుతూ ప్రతి చాప్టర్‌లో సమాజ బంధాలను బలోపేతం చేస్తున్నాం అన్నారు.

ఫిల్లీ, న్యూజెర్సీ, అట్లాంటాలో జరిగిన బోనాల ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అత్యంత వైభవంగా జరిగాయి. సంప్రదాయ బోనం ఊరేగింపు, పోతరాజులు, అమ్మవార్ల ప్రదర్శనలు,అలంకరించిన ప్రభల అమ్మవార్ల ఊరేగింపు, రంగురంగుల తొట్టెలు, రిథమిక్ డప్పులు, ప్రసాదం సమర్పణ, ఆకట్టుకొనే సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ఉత్సవాల విజయానికి మాటా వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అధ్యక్షుడు కిరణ్ కుమార్ దుద్దాగి, స్పిరిచ్యువల్ ఛైర్ శిరీష గుండపునేని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, గౌరవ సలహాదారులు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు, స్టాండిరగ్ కమిటీ సభ్యులు, రీజినల్ కోఆర్డినేటర్లు, సమాజ స్వచ్ఛంద సేవకులు కృషి చేశారు.

న్యూజెర్సీ ఉత్సవాన్ని స్పిరిచ్యువల్ చైర్ శిరీష గుండపునేని నేతృత్వంలోని న్యూజెర్సీ కోర్ టీమ్ నిర్వహించగా, ఫిల్లీ ఈవెంట్‌ను శ్రీధర్ గూడల ( ట్రెజరర్) బృందం సమన్వయం చేసింది. అట్లాంటా బోనాలను నాగేష్ చిలకపాటి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) బృందం ప్లాన్ చేసి నిర్వహించింది. ఈ బృందాలకు ప్రవీణ్ గూడూరు ( ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), విజయ్ భాస్కర్ కలర్ ( జనరల్ సెక్రటరీ) కళ్యాణి రెడ్డి బెల్లంకొండ ( కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ), డాక్టర్ సరస్వతి లక్కసాని ( హెల్త్ వెల్‌నెస్ డైరెక్టర్), సురేష్ కజన ( స్పోర్ట్స్ డైరెక్టర్) సహకారం అందించారు. ఈ ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ పాత్రల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

శరణ్య దుద్దాగి, అన్విత గూడూరు, సిద్ధార్థ్ తమ్మ, ఈశాన్ తంగిరాల, సత్య నేమాన, ప్రీతి ముల్బగల్, రఘు వెస్సం, వేణు గిరి, దీపక్ కట్టా, నరేందర్ ఎర్రంగూరి, మధుసూదన్ కుంకు వంటి వారు ఈ కార్యక్రమాలకు మరింత శోభను తెచ్చారు. న్యూజెర్సీ ఉత్సవానికి ఎన్‌జే సాయిదత్త పీఠం టెంపుల్ నుంచి రఘు శర్మ శంకరమంచి, ఆలయ పూజారులు, స్వచ్ఛంద సేవకులు ఆధ్యాత్మిక సహకారం అందించాయి.న్యూజుర్సీ బోనాల వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పాల్గొని మాటా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అట్లాంటాలో గణేష్ ఆలయం, ఫిల్లీలో సాయి టెంపుల్ ఆఫ్ మాల్వెర్స్ సహకారాన్ని అందించాయి.
















