Namaste NRI

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలి: నవీన్ రెడ్డి

లండన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు  ఘనంగా జరిగాయి.  రీడింగ్ పట్టణ ఎన్నారై బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే కార్యవర్గ సభ్యులంతా కలిసి వేడుకల్ని నిర్వహించారు. మేమంతా కేసీఆర్ వెంటే అంటూ ఎన్నారైలు నినదించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి మొట్ట మొదటి సారి ఖండాంత రాల్లో లండన్ గడ్డ పై గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్‌ వెంటే ఉండి స్వరాష్ట్ర సాధనలో మా బాధ్యత నిర్వహించామన్నారు. అలాగే నేడు కూడా అదే స్ఫూర్తితో వారి వెంటే నడిచి తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి బీరం, అధికార ప్రతినిధులు హరి గౌడ్ నవాబుపేట్, సభ్యులు రవి కుమార్ రత్తినేని, సతీష్ రెడ్డి బండ, సత్యపాల్ రెడ్డి పింగిళి, శ్రీకాంత్ జెల్ల, మహేందర్, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్య చిలుముల పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events