Namaste NRI

బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు కాదు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు చేయడాన్ని ఎఫ్దీసి మాజీ చైర్మన్, బీఆర్ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా అనిల్  మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన బెట్టినందుకు ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న నాయకులని వేధించడం మానేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని అనిల్ హితవు పలికారు.బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడేవారు కాదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో మీకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు.

Social Share Spread Message

Latest News