బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూకె, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, గల్ఫ్ ప్రాంతాల్లో జరపడానికి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలా తెలిపారు. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లోని కొన్ని వేదికలను స్థానిక బీఆర్ఎస్ టీమ్ సభ్యులు, యువ విభాగం నేత సన్నీ గౌడ్, మరికొందరు సభ్యు లతో కలిసి మహేష్ బిగాలా పరిశీలించారు.


ఈ సందర్భంగా మహేష్ బిగాలా మాట్లాడుతూ డల్లాస్‌లో జరిగిన బీఆర్ఎస్ గ్రాండ్ ఈవెంట్ అత్యంత విజయవంతంగా సాగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ రజతోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని వివిధ దేశాల నుండి అనేక అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపారు. వేదిక, తేదీల విషయంలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశం అయ్యాక అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. డల్లాస్‌లో మా గొప్ప విజయాన్ని ఆస్వాదించాక, మరింత ప్రగతి సాధిస్తూ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా జరుపుకునేందుకు కృషి చేస్తున్నాం. ఆస్ట్రేలియాలోని సహచరులు, యువ నేతలతో కలిసి ముందుకు సాగుతున్నాము అని పేర్కొన్నారు.
















