కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ – యూఎస్ఏ జాతీయ సదస్సు 2023 నిర్వహించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రముఖ అటార్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షులు అరిందమ్ గుహ, బ్లూ ఆష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ ఝవేరి హాజరయ్యారు. బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్లు పూర్ణ బైరి, చందు తాళ్ల వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో 50 రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత అమెరికాలో ఇదే తొలి జాతీయ సదస్సు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/mahesh-usa1_V_jpg-816x480-4g.jpg)
ఈ సందర్భంగా తన్నీరు మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుబంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీఆర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందన్నారు. టీ హబ్ ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యూబేటర్ అని, టీ వర్క్స్ ఆవిష్కర్తలకు కేంద్రం అన్నారు. డేటా సెంటర్ పాలసీ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వార పదిహేను రోజుల్లో కంపెనీలు స్వీయ ధ్రువీకరణ చేసుకోగలిగిన కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కేటీఆర్ నిరంతర శ్రమ, చొరవతో సాధ్యపడ్డాయని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-172.jpg)
బీఆర్ఎస్ యూఎస్ఏను అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, సమావేశాలకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎన్నారైలను ఆహ్వానించడం, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి, తెలంగాణ నమూనాకు సంబంధించిన వీడియోలను వివిధ భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం లాంటి కార్యక్రమాల చేపట్టాలని తన్నీరు మహేష్ కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ యూఎస్ఏ కార్యకర్తల పాత్ర కీలకమని అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తన్నీరు మహేష్ ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులు ఆమోదించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-172.jpg)
ఈ కార్యక్రమంలో అడ్వైజర్ రవి ధన్నపునేని, బిందు చీదెళ్ల, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.. సియాటిల్ నుండి గణేష్ యూత్ కమిటీ నాయకులు అభిషేక్ కొత్తూర్, ఉదయ్ యాదవ్, కిషోర్, శరన్ దొంతినేని, కార్తీక్ రంగినేని, సంతోష్ , ఫ్లోరిడా నుండి టోనీ జన్ను, కాలిఫోర్నియా నుండి రాజ్ భవాని, శివ కాలేరు, డెట్రాయిట్ నుండి అనిల్ దొంతినేని, వెంకట్ మంతెన, డెలావేర్ నుండి భాస్కర్ పిన్న చికాగో నుండి మహిపాల్ రెడ్డి, ప్రశంష్, న్యూ జెర్సీ నుండి మహేష్ పొగాకు, శ్రీనివాస్ జక్కిరెడ్డి. వాషింగ్టన్ డీసీ నుండి అనిల్ కాశినేని, కిషోర్, అట్లాంటా నుండి శ్రీధర్ జూలపల్లి, రంజిత్ కోదాటి, డల్లాస్ నుండి శ్రీనివాస్ సురభి, మనోజ్ ఇనగంటి, శ్రీకాంత్ పీచర, దేవేందర్ చిక్కాల, గిరిధర్ వీరమనేని, శశి దొంతినేని, ఆస్టిన్ నుండి హరీష్ రెడ్డి వ్యాల్ల, శ్రీనివాస్ పొన్నాల పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-170.jpg)