భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీ లోని సింధ్ ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేం దుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు ప్రధానికి సూచించారు. రాజకీయ సుస్థిరతతో పాటు ఎగుమ తుల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషించేందుకు ప్రధాని వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఖర్చులు, అస్థిరమైన ప్రభుత్వ విధానాలతో వ్యాపారాలు చేయడం దాదాపు అసాధ్యం అని వ్యాపారవేత్తలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన వ్యాపార వేత్తలు, మరిన్ని చర్యలు అవసమని తెలిపారు. క్యాపిటల్ మార్కెట్ల దిగ్గజం ఆరిఫ్ హబీబ్ గ్రూప్ అధిపతి ఆరిఫ్ హబీబ్ మాట్లాడుతూ షెహబాజ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు ఒప్పందాలు చేసుకున్నారని, అవి మంచి ఫలితాలే ఇచ్చాయన్నారు. అలాగే భారత్‌తో వాణిజ్య చర్చలను ప్రారంభించా లని ఆయన ప్రధానికి సూచించారు.