సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన చిత్రం బుట్ట బొమ్మ. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యువ సంచలనం సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను ఈ వేడుకకు ఆహ్వానించిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. సితార అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. బుట్టబొమ్మ గురించి చెప్పాలంటే కథే ఈ సినిమా హీరో. ఈ సినిమా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్ గా ఉంటుంది. అసలు ఈ సినిమా నేను చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈ సినిమా చూశాక అట్లుంటది మనతోని అని ఈ సినిమా అంటుంది మీతో. ఈ సినిమా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే దర్శకుడు రమేష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారని అర్థమవుతుంది. అనిఖా, సూర్య, అర్జున్ దాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సితార నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది. డీజే టిల్లు చూసినవాళ్లు అందరూ ఈ సినిమా కూడా చూసి ఆదరించండి. చాలా బాగుంటుంది అన్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకలో దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.