Namaste NRI

2100 నాటికి అమెరికాలో సగం ఘోస్ట్‌ టౌన్లు

 2100నాటికి అమెరికాలోని దాదాపు సగం పట్టణాలు ఘోస్ట్‌ టౌన్లుగా మారబోతున్నాయి. ఈ పట్టణాల్లో జనాభా గణనీయంగా తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని 30 వేల పట్టణా ల్లో దాదాపు 15 వేల పట్టణాల్లో జనాభా క్రమంగా తగ్గనున్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పెద్ద నగరాలకు వలస వెళ్లడం ఒక కారణమైతే, నివాసానికి అనువైన ఉష్ణోగ్రతలు ఉన్న నగరాల కు అమెరికాలో ప్రాధాన్యం పెరుగుతుండటం మరో కారణమని వివరించింది. కాగా, అమెరికాలోని 60 శాతం పట్టణాల్లో జనాభా 5 వేల కంటే తక్కువగా ఉన్నదన్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events