భారతీయ విద్యార్థుల ఆశలపై కెనడా ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2024లో స్టడీ పర్మిట్లకు భారీగా కోత విధించేం దుకు సిద్ధమైంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించనున్నామని ఆ దేశ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది గడువు తీరిపోతున్న స్టడీ పర్మిట్లకు సమానంగా కొత్త స్టడీ పర్మిట్లు మంజూరు చేయాలన్న విధానాన్ని ఎంచుకున్నట్టు ఆయన చెప్పారు. 2024లో కెనడా జారీ చేయబోయే స్టడీ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలుగా ఉండబోతున్నదని చెప్పారు. అయితే ప్రైమరీ, సెకండరీ స్కూల్ స్టూడెంట్స్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ విద్యార్థులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కెనడా తెలిపింది.