దేశంలో పెరుగుతున్న ఇండ్ల కొరత, నిరుద్యోగానికి చెక్ పెట్టేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశీ విద్యార్థుల వీసాలపై రెండేండ్లు పరిమితి విధించింది. పరిమితిలో భాగంగా 2024లో ఇప్పుడిస్తున్న వీసాల్లో 35 శాతం కోత విధించనున్నట్టు ఇమ్మిగ్నేషన్ మంత్రి మార్క్ మిల్లర్ వెల్లడించారు. పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత 3,64,000 మందికి వీసాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపర్చి వారికి ఉన్నతమైన విద్యనందించడమే పరిమితి వెనుకున్న ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. 2025కు సంబంధించి జారీ చేసే వీసాల సంఖ్యను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.