
కెనడాలో జరుగనున్న జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఈ మేరకు మోదీకి ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని కోరారు. ప్రధాని మోదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ జె కార్నీ నుంచి ఫోల్ కాల్ రావడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల విజయంపై ఆయనను అభినందించా. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపా. ప్రజల మధ్య బలమైన సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, కెనడా పరస్పరం గౌరవం పొందాయి. నూతన శక్తితో కలిసి పనిచేస్తాం. శిఖరాగ్ర సమావేశంలో మన మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నారు.
