మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. చిరంజీవికి మనవరాలు పుట్టింది. యంగ్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డను కన్నది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది.మెగాస్టార్ ఇంట్లో మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టనుండటంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/apollo.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-170.jpg)
కాగా, రామ్ చరణ్, ఉపాసనలకు 2012 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు బిడ్డ పుట్టబోతున్నట్లు రెండు కుటుంబాలు గత ఏడాది డిసెంబర్ 12న వెల్లడించాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-170.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-168.jpg)