టాలీవుడ్ యువ హీరోలు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ పండుగా కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. యానిమల్ సినిమాకు బీజీఏం అందిం చిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. టీజో టామీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.